News March 22, 2024
కొత్త ‘లిక్కర్ పాలసీ’ని ఎందుకు తెచ్చింది?
మద్యం వ్యాపారంలో మాఫియా నియంత్రణ, ప్రభుత్వ ఆదాయం పెంపు, వినియోగదారుల సమస్యల పరిష్కారం వంటి ఆలోచనలతో ఢిల్లీలోని AAP ప్రభుత్వం లిక్కర్ పాలసీని తెచ్చింది. ఈ ప్రకారం మద్యం విక్రయాలు ప్రైవేటు పరం అయ్యాయి. MRP కంటే తక్కువకే మద్యం అమ్మేలా ప్రోత్సహించడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి 27%ఆదాయం పెరిగిందని ప్రకటించింది. BJP ఆరోపణలతో ED రంగప్రవేశం చేయగా పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Similar News
News November 26, 2024
జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం.. ఆ సేవలు రద్దు
AP: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలతో పాటు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రం అనుమతివ్వనున్నారు.
News November 26, 2024
కులగణన సర్వే 92.6 శాతం పూర్తి
TG: రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే 1,08,89,758 ఇండ్లలో(92.6 శాతం) పూర్తి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 13 జిల్లాల్లో 100శాతం, 17 జిల్లాల్లో 90 శాతంపైగా, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 82.3% పూర్తయినట్లు పేర్కొంది. మరోవైపు ఆన్‌లైన్‌లో డేటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.
News November 26, 2024
వెంకటేశ్‌కు ‘సంక్రాంతి’ కలిసొస్తుందా?
విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. 2005లోనూ సంక్రాంతి సమయంలో ‘సంక్రాంతి’ మూవీతో వెంకీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు. దీంతో హిస్టరీ రిపీట్ అవుద్దని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలు పండుగకు విడుదల కానున్నాయి.