News March 4, 2025
తిరుపతి జిల్లాలో ఇవాళ్టి ముఖ్యంశాలు

☞ చెవిరెడ్డికి MLA నాని భార్య సవాల్ (వీడియో)
☞ తిరుపతి: తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను
☞ తిరుమలలో మరోసారి చిరుత కలకలం
☞ రేణిగుంట: అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
☞ సుధారెడ్డి ఫోన్.. కట్ చేసిన చెవిరెడ్డి
☞ శ్రీకాళహస్తి: భక్తుడు పోగొట్టుకున్న బ్రాస్లెట్ అప్పగింత
☞ నాయుడుపేట కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం రవాణా
Similar News
News March 15, 2026
గొల్లపల్లి: ఇంటి మనస్పర్ధలు.. గోదావరిలో యువకుడి మృతి

గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామానికి చెందిన కాంపల్లి రాము (26) <<19391989 >>మృతదేహం<<>> కోటిలింగాల గోదావరి నదిలో లభ్యమైంది. ఇంట్లో మనస్పర్ధల కారణంగా ఈ నెల 13న ఉదయం 11:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆదివారం ఉదయం కోటిలింగాల వద్ద గోదావరిలో అతని మృతదేహం కనిపించింది. మృతుడి తమ్ముడు కాంపల్లి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గొల్లపల్లి ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి తెలిపారు.
News March 15, 2026
‘ఉస్తాద్’ అందుకే లేట్ అయింది: హరీశ్ శంకర్

కథ మారినందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఆలస్యమైందని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపారు. తొలుత అనుకున్న స్టోరీ సెట్ కాకపోవడంతో స్క్రిప్ట్ మార్చడం, కరోనా వంటి కారణాలతో లేట్ అయిందన్నారు. ఈ జర్నీలో ప్రొడ్యూసర్స్, పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇక మూవీ ఆలస్యంపై కొందరు కథలుకథలుగా మాట్లాడుకున్నారని, అది సృష్టి ధర్మమని హరీశ్ సెటైర్ వేశారు. ఈ సారి పండుగ ఉస్తాద్ ఉగాది అన్నారు.
News March 15, 2026
అమలాపురం: బాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దంపతుల విజయం

అమలాపురం బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ టోర్నమెంట్‌లో రాజమండ్రికి చెందిన దంపతులు తమ అద్భుత ప్రతిభతో విజేతలుగా నిలిచారు. రాజీ, విజయ్ జంట క్రీడా మైదానంలో ఒకరికొకరు చక్కని సమన్వయంతో ఆడి ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే జట్టుగా ఆడి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడం అక్కడి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.


