News March 4, 2025
నెల్లూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్యంశాలు

☞ నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. 15 ఏళ్లు జైలు శిక్ష
☞ నెల్లూరు: ధైర్య సాహసాల పోలీస్ అధికారి ఇక లేరు
☞ మనుబోలు: స్వీట్స్‌తో శ్రీ విశ్వనాథ స్వామికి ఏకాంత సేవ
☞ ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలి: MLA ప్రశాంతి
☞ నెల్లూరు: చంద్రబాబుపై రైతు ఆగ్రహం
☞ ఉదయగిరి: సేల్స్ టాక్స్ అధికారుల దాడులంటూ పుకార్లు
☞ సంగం: రూ.3.5 లక్షల విలువ చేసే ఉత్సవ విగ్రహాల అందజేత
Similar News
News March 3, 2026
నెల్లూరు రూరల్లో అనిల్ X గిరిధర్ రెడ్డి!

ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నా నెల్లూరు రూరల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. MLA తమ్ముడు గిరిధర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. YCP ఇన్‌ఛార్జ్‌గా ఆనం విజయ్ కుమార్ రెడ్డే పోటీలో ఉంటారని కాకాణి చెప్పినా.. అనిల్ యాదవ్ పేరు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతానికి అనిల్ నెల్లూరుకు అంటీముట్టనట్లు ఉన్నారు. రోజూ ప్రజల్లో తిరుగుతున్న గిరిధర్ రెడ్డిలో ఎవరు గెలుస్తారో మరి.
News March 3, 2026
నేడు కనుపూరు ముత్యాలమ్మ మొదటి చాటింపు

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ జాతర మొదటి చాటింపు మంగళవారం అర్ధరాత్రి వేస్తున్నట్లు ఆలయ ఎక్స్ అఫీషియో సభ్యుడు చాకిరి రమణయ్య తెలిపారు. చంద్రగ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఈ చాటింపు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతర నిర్వహణకు సంబంధించి గ్రామస్థులు, భక్తులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
News March 3, 2026
నెల్లూరు: బాలికలకు HPV వాక్సిన్

మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించిండానికి ప్రభుత్వం ఉచితంగా HPV వాక్సిన్‌ను అందుబాటులోకి తేనుంది. నెల్లూరు జిల్లాలో 80 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 14- 15 ఏళ్ల లోపు బాలికలకు HPV వాక్సిన్ వేయనున్నారు. జిల్లా 24.69 లక్షలు మంది ఉండగా.. ఇందులో ఒక శాతం(24వేలు) మంది బాలికలు 14-15 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా. ఎంతో ఖరీదైనా ఈ వాక్సిన్‌ను ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి తీసుకురానున్నారు.


