News March 4, 2025

వెయిట్ లిఫ్టింగ్ పోటీల విజేతలకు అభినందనలు

image

అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏయూ తరఫున పాల్గొని 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి గోల్డ్ మెడల్, 76 కిలోల విభాగంలో బి.జాన్సీ బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా ఖేలో ఇండియా యూనివర్శిటి పోటీల్లో 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి సిల్వర్ మెడల్, సీహెచ్ శ్రీలక్ష్మికి 87 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వీరిని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందించారు.

Similar News

News March 12, 2026

విశాఖలో రూ.100 కోట్లతో భారీ అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్

image

విశాఖలో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్ రిసార్ట్ అభివృద్ధి కోసం మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పర్యాటక శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ముంబాయిలో జరిగిన IAAPI ఎక్స్‌పో-2026 మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఒప్పందం అయ్యింది. 100 గదుల సామర్థ్యం కలిగిన విలాసవంతమైన రిసార్ట్ ఉంటుందని, సుమారు 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

News March 12, 2026

ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తాం: క్యాప్ జెమినీ సీఈవో

image

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేశ్ గురువారం విశాఖలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ అన్నారు. 1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది).

News March 12, 2026

విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్

image

విశాఖలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి నారా లోకేశ్ గురువారం భేటీ అయ్యారు. విశాఖలో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. నగరం ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 20 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో క్లౌడ్, బీపీఎం సేవల కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ తెలిపారు.