News March 4, 2025

ఐదో రౌండ్ పూర్తి: ముందంజలో బీజేపీ అభ్యర్థి

image

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 7,142 ఓట్ల ముందంజలో ఉన్నారు. అంజిరెడ్డికి 38,553, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 31,411, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ) 26,300 ఓట్లు సాధించారు.

Similar News

News March 5, 2025

SLBC కార్మికుల కోసం జాగిలాలతో అన్వేషణ

image

TG: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. రెండో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

News March 5, 2025

రాష్ట్రంలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 4,88,448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్‌లపై నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

News March 5, 2025

ఒకప్పుడు నటిగా ఫెయిల్… ఇప్పుడు గూగుల్ ఇండియా మేనేజర్

image

ఆ అమ్మాయి ఒకప్పుడు మహేశ్ బాబుతో నటించారు. పలు సీరియల్స్‌లోనూ తన లక్ పరీక్షించుకుంది. సక్సెస్ కాకపోవటంతో వేరే రంగాన్నిఎంచుకొని ఇప్పుడు పలువురికి రోల్ మోడల్‌‌గా నిలుస్తున్నారు. మయూరి కాంగో నటిగా స్థిరపడాలనుకున్నారు. సెట్ కాకపోవటంతో పెళ్లిచేసుకొని విదేశాలకు వెళ్లారు. న్యూయార్క్‌లో ఎంబీఏ చేసి పలు కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం ఏకంగా గూగుల్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

error: Content is protected !!