News March 5, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES

✷ పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం ✷ సబ్సిడీ రుణాలకు లబ్ధిదారులు ఎంపిక చేయండి ✷ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల గెలుపు ✷ అంగన్వాడీ సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం ✷ నరసాపురంలో 8 కేజీల వెండి చోరీ ✷జై ఇరిగేషన్ సిస్టంతో ఉద్యానం యూనివర్సిటీ ఎంవోయూ✷ నర్సాపురం: మిస్సింగ్ అయిన మహిళ మృతి
Similar News
News March 27, 2026
ప.గో: సమస్యకు పరిష్కారం చూపని నాయకులు, ప్రభుత్వాలు (1/3)

పెదపేట రామాలయ వివాద పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దీర్ఘకాలంగా రగులుతున్న ఈ సమస్యపై ముందస్తుగా దృష్టి సారించకపోవడం వల్లే వేడుకల్లో దాడుల వరకూ పరిస్థితి వెళ్లింది. ఈ వివాదం భవిష్యత్తులో మరింత జటిలం కాకముందే. అధికారులు, నాయకులు తక్షణమే జోక్యం చేసుకుని ఇరువర్గాలతో చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.
News March 27, 2026
ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: ప.గో జేసీ

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం (M) మోదుగగుంటలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ధాన్యం సేకరణకు రెండు కోట్ల గోనె సంచులను సిద్ధం చేశామన్నారు. సంచుల నాణ్యతను రైతులు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
News March 27, 2026
మహిళల భద్రత కోసం శక్తి యాప్: కలెక్టర్

భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013”నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను ఉపయోగించాలన్నారు. స్వయంగా మహిళల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సేవల పనితీరును పరిశీలించారు.


