News March 5, 2025

గన్నవరం: పవన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు 

image

ఈనెల 7వ తేదీన గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. 

Similar News

News February 5, 2026

పాఠశాలల ప్రగతిలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

తాము చదువుకున్న పాఠశాలలను మర్చిపోకుండా, వాటి అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ వంతు సాయం అందించడం అభినందనీయమన్నారు. పాఠశాలల బలోపేతానికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని, వారి భాగస్వామ్యం నేటి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 5, 2026

కృష్ణా: రేపు నిమ్మకూరులో TDP నూతన కార్యవర్గ ప్రమాణం!

image

TDP జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని రేపు NTR స్వగ్రామమైన నిమ్మకూరులో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి NTR కుమారుడు నందమూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోపు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News February 4, 2026

‘డిసెంబర్ 31 నాటికి బందరు పోర్ట్ తొలి దశ పూర్తి’

image

బందరు ఓడరేవు తొలి దశలో 4 బెర్తుల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని మెగా ఇంజినీరింగ్ లిమిటెడ్ జీఎం తులసీదాసు తెలిపారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలోని బృందం ప్రాజెక్ట్ పనులను బుధవాం పరిశీలించింది. 2000 ఎకరాల్లో సాగుతున్న పనుల్లో 1300 మంది కూలీలు పనిచేస్తున్నట్లు వివరించారు.