News March 5, 2025
కెరమెరి: జిల్లా కలెక్టర్‌కు ప్యాషన్ ఫ్రూట్స్ అందించిన రైతు

మండలంలోని ధనోర గ్రామానికి చెందిన రైతు కేంద్రే బాలాజీ తన పొలంలో సేంద్రియ పద్ధతిలో పండించిన ప్యాషన్ ఫ్రూట్స్‌ను(కృష్ణఫలం) కలెక్టర్ వెంకటేష్ ధోత్రేకు అందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ప్యాషన్ ఫ్రూట్స్ బహూకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో ప్యాషన్ ఫ్రూట్స్‌తో పాటు వివిధ పండ్లు పండించడం జిల్లాకే గర్వకారణమని ఆయనను అభినందించారు.
Similar News
News October 30, 2025
బీ అలెర్ట్.. కృష్ణా నదికి 6 లక్షల క్యూసెక్కుల వరద.!

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా నది మరోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇవాళ ప్రకాశం బ్యారేజ్‌కి 6 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్యారేజ్ వద్ద 2.68 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 2 గంటల్లో 3.97 లక్షలకు వరద చేరుకుంటుందని దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనునట్లు అధికారులు తెలిపారు.
News October 30, 2025
కామారెడ్డి: నవంబర్ 4న యువజన వారోత్సవాలు

జిల్లాలోని కళాభారతి వేదికగా నవంబర్ 4న యువజన వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కళాకారుల బృంద సభ్యులు గురువారం తెలిపారు. పాటలు, వ్యాసరచన, డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలో పాల్గొనదలిచిన యువత వయస్సు 15 నుంచి 29 ఏళ్ల వయస్సు, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 2వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 30, 2025
కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.


