News March 5, 2025
బాపట్ల: జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగింపు

కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాజకీయ నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించనున్నారు. అలాగే కౌంటింగ్ నేపథ్యంలో మూసివేసిన మద్యం షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 4, 2025
సంగారెడ్డి: ఉన్నత చదువులు.. 30 మంది టీచర్లకు అనుమతి

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు అనుమతిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 30 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని డీఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 4, 2025
VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
News November 4, 2025
నష్టం వివరాలను త్వరగా పంపించండి: కలెక్టర్

తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే నివేదికలు పంపించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన ఈ పంట ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే దెబ్బతిన్న రహదారుల వివరాలను సైతం పంపాలన్నారు.


