News March 22, 2024
పాత రూ.100 నోట్లు చెల్లవంటూ ప్రచారం

పాత రూ.100 నోట్లు చెల్లవంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ‘పాత రూ.100 నోట్లను మార్చి 31లోపు ఖర్చు పెట్టుకోండి. లేదా బ్యాంకులో రిటర్న్ చేయండి. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి అవి చెల్లుబాటు కావు’ అంటూ మెసేజ్లను కొందరు వైరల్ చేస్తున్నారు. అయితే పాత రూ.100 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఫేక్ మెసేజ్ను నమ్మకండి. ఇతరులకు ఫార్వర్డ్ చేయకండి.
Similar News
News July 7, 2025
ఆకాశ్ దీప్.. ఆకాశమంత టాలెంట్ అంతే మనస్సు

ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో భారత పేసర్ ఆకాశ్ దీప్ పేరు మారుమోగుతోంది. బుమ్రా లేకపోతే ఇంగ్లండ్ చేతిలో 2వ టెస్టులోనూ మనకు ఓటమి తప్పదనుకున్నారంతా. కానీ, ఆకాశ్ 10 వికెట్లు తీసి భారత్కు మరుపురాని విజయాన్ని కట్టబెట్టారు. బుమ్రాను మరిపించారు. ఈ ఘనతను క్యాన్సర్తో పోరాడుతున్న తన సోదరికి అంకితమిచ్చి హృదయాలు గెలిచారు. గబ్బాలో గతంలో ఆకాశ్ గురించి స్మిత్ ఎందుకు పొగిడారో ఈ మ్యాచ్తో అందరికీ అర్థమైంది.
News July 7, 2025
గుత్తా జ్వాల కుమార్తెకు పేరు పెట్టిన ఆమిర్ ఖాన్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ దంపతుల కుమార్తెకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేరు పెట్టారు. HYD వచ్చి మరీ వారి పాపకు మిరా అని నామకరణం చేశారు. కాగా ‘మిరా అంటే ప్రేమ, శాంతి. ఆమిర్ సర్ మీతో ప్రయాణం ప్రత్యేకం. మా పాపకు అద్భుతమైన పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు’ అని విశాల్ SMలో పోస్ట్ చేశారు. 2021 ఏప్రిల్ 22న వీరు వివాహం చేసుకోగా వారికి ఈ ఏప్రిల్ 22న పాప పుట్టింది.
News July 7, 2025
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 50 వేల ఉద్యోగాలు!

2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. 21 వేల మంది ఆఫీసర్ల విభాగంలో కాగా, మిగిలినవి క్లర్కులు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ నియామకాల్లో కేవలం SBI ఒక్కటే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది.