News March 5, 2025
జిల్లావ్యాప్తంగా 163 BNSS అమలు : SP

ఇంటర్మీడియట్ పరీక్షలు నేపథ్యంలో ఈనెల 25 వరకు జిల్లా వ్యాప్తంగా BNSS 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 19 పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 22, 2026
భోజనం తర్వాత మళ్లీ ఆకలి వేస్తోందా?

రాత్రి భోజనం తిన్నాక అర్ధరాత్రి మళ్లీ ఆకలి వేసే సమస్య పెరుగుతోంది. దీంతో జంక్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని నియంత్రించడానికి నిపుణులు పలు చిట్కాలు చెబుతున్నారు. ‘రాత్రి ఆహారంలో పప్పులు, గుడ్లు, పనీర్, గోధుమలు, రాగులు, బ్రౌన్ రైస్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. పెరుగన్నం, గుప్పెడు నట్స్ తిన్నా, పసుపు కలిపిన గ్లాసు గోరు వెచ్చని పాలు తాగినా ఆకలి తగ్గుతుంది’ అని పేర్కొంటున్నారు.
News March 22, 2026
ఈ జర్నీ అంత సులభం కాదు: అనయా బంగర్

ఇటీవల లింగ మార్పిడి <<19387841>>సర్జరీ<<>> చేయించుకున్న భారత్ మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు అనయా బంగర్ SMలో భావోద్వేగ పోస్ట్ చేశారు. అమ్మాయిగా మారాలనే తన నిర్ణయాన్ని తన తండ్రి, ఫ్యామిలీ సపోర్ట్ చేయడం అంత ఈజీగా జరగలేదని తెలిపారు. తన తండ్రి అండగా ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. అనయాబంగర్‌గా గుర్తింపును మార్చుకున్న ఆర్యన్ బంగర్ 2024లో హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ, రీసెంట్‌గా ఈ సర్జరీ చేయించుకున్నారు.
News March 21, 2026
VIJ: అన్న క్యాంటిన్‌లో భోజనం చేసిన కలెక్టర్

విద్యాధరపురంలోని అన్న క్యాంటీన్‌లో శనివారం రాత్రి VMC స్పెషల్ ఆఫీసర్ & కలెక్టర్ లక్ష్మీశ భోజనం చేశారు. స్వయంగా తాము క్యూలో ఉండి టోకెన్ తీసుకొని భోజనం చేశారు. క్యాంటిన్ నిర్వహణ, ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలు గురించి అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహారంలో నాణ్యత లోపిస్తే తమకు వెంటనే క్యూఆర్ కోడ్, ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు.


