News March 5, 2025

తాగునీటిపై ఒక్క ఫిర్యాదు కూడా రాకూడ‌దు: కలెక్టర్  

image

జిల్లాలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. ఈనెల 15 నాటికి 100 శాతం తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాలూ క్రియాశీలం కావాల‌ని అన్నారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ నుంచి ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, వివిధ అధికారుల‌తో ఆయన టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. 

Similar News

News January 8, 2026

NLG: సంక్రాంతికి స్పెషల్ బస్సులు

image

సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సిద్ధమైంది. పండుగకు స్వస్థలాలకు వచ్చి వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపించేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి నల్గొండ రీజియన్‌లోని 7 డిపోల నుంచి 298 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పండుగ తర్వాత 17 నుంచి 20వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడపనున్నారు.

News January 8, 2026

హరియాణాలో కామారెడ్డి వాసి దారుణ హత్య

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన కటికే రజనీకాంత్ (40) హరియాణాలో కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు హరియాణాకు వెళ్లారు.

News January 8, 2026

పాలమూరు: ‘రెండేళ్లు KCR నిద్రపోయిండు’

image

అధికారం పోయాక రెండేళ్లు KCR ఫామ్‌హౌస్‌లో నిద్రపోయిండని వనపర్తి, దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి అన్నారు. <<18792930>>వనపర్తిలో వారు<<>> మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కు ప్రజలు సపోర్ట్ చేస్తుంటే KCR తట్టుకోలేకపోతుండు.. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి నిద్రలోంచి లేచి నీళ్ల దోపిడీ అంటూ మాట్లాడిండు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అప్పుడే ఎందుకు పూర్తి చేయలేదో BRS వాళ్లు చెప్పాలి’ అని అన్నారు.