News March 5, 2025
నిర్మల్: పకడ్బందీగా SSC పరీక్షలు :DEO

పకడ్బందీగా SSC పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో రామారావు తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న ఆంగ్ల పీరియడ్‌ను పరిశీలించారు. అక్కడ ప్రదర్శించబడిన గ్రాండ్ టెస్ట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పిలిచి, అన్ని విషయాల్లో వారి ప్రగతిని పరిశీలించారు.
Similar News
News April 18, 2026
GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.
News April 18, 2026
1 Min లేటైనా CETకు అనుమతి లేదు

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్‌లలో ఉంటాయి.
News April 18, 2026
సంతమాగులూరులో కుళ్లిన మృతకళేబరం కలకలం

సంతమాగులూరు మండలంలోని కొప్పరం నుంచి సజ్జాపురం వెళ్లే మార్గంలో ఉన్న చెరువులో కుళ్లిన కళేబరం శుక్రవారం కలకలం రేపింది. ఎముకుల గూడుతో ఉన్న డెడ్‌బాడీని పశువుల కాపరి చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. అనంతరం విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. దీనిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


