News March 5, 2025

NZB: మార్కెట్‌కు భారీగా పసుపు.. ధర ఎంతంటే?

image

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు భారీగా పసుపు తీసుకుని వస్తున్నారు. శివరాత్రి తరువాత మార్కెట్ కు వరుస సెలవులు రావడంతో నిన్నటి నుంచి భారీగా పసుపు వస్తోంది. దీనితో మార్కెట్ పసుపు మయంగా మారింది. కాగా నిన్న హై గ్రేడ్ పసుపు కొనుగోలు ధర రూ.13,311 పలుకగా మీడియం  రూ.11,30, లో గ్రేడ్ రూ.10 వేలు పలికింది. 

Similar News

News March 5, 2025

రుద్రూర్: చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

image

రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు(45) అనే వ్యక్తి మంగళవారం స్థానికంగా ఉన్న గుండ్లవాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బురదలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ సాయన్న బుధవారం తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News March 5, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఎడపల్లి మండల ఠాణకలాన్ గ్రామ శివారులోని పోలీస్ ట్రైనింగ్ క్యాంపు ఎదుట బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఠాణకలాన్‌కు చెందిన మెట్టు శ్రీనివాస్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు గ్రామానికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు  చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News March 5, 2025

NZB: మొదటి రోజు 753 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు DIEO రవికుమార్ తెలిపారు.జిల్లాలో 19,191 మంది విద్యార్థులకు 18,438 మంది పరీక్షలకు హాజరయ్యారు. 753 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. 96.1 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలి రోజు పరీక్ష ముగిసింది. 57 పరీక్ష కేంద్రాలకు, 50 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు.

error: Content is protected !!