News March 5, 2025

రోగులకు మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

image

మణుగూరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మణుగూరు ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో కలియ తిరుగుతూ జనరల్ వార్డు, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, స్కానింగ్, డయాలసిస్ యూనిట్ లను పరిశీలించి రోగులతో మాట్లాడారు.

Similar News

News November 9, 2025

హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలి: భద్రయ్య

image

సమాజంలో ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ళ భద్రయ్య అన్నారు. ఆదివారం ములుగులో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అవినీతి, అక్రమాలకు తావులేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.

News November 9, 2025

నిద్ర సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

అధిక రక్తపోటు లక్షణాలు ఎక్కువగా రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాన్/ఎయిర్ కండిషనర్ ఉన్నా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ మూత్ర విసర్జన, దీర్ఘకాలిక అలసట, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఛాతి నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

News November 9, 2025

BREAKING.. MBNR: ట్రాక్టర్, ఆటో ఢీ.. మహిళ మృతి

image

మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి-మల్లాపూర్ రోడ్డులో ఆటోను పత్తి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మల్లాపూర్‌కు చెందిన వడ్డే మల్లీశ్వరి (21) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి ఆరు నెలల వయసున్న కవల పిల్లలు (బాలుడు, బాలిక) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.