News March 5, 2025
రాజమండ్రి: బోటింగ్, నది విహారం కార్యక్రమాలు నిర్వహణ

తూ.గో జిల్లా పరిధిలో చేపల వేట ద్వారా జీవనోధారంతో పాటు, పర్యటక అభివృద్ది పరంగా బోటింగ్, నది విహారం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. వీటికి సంబంధించిన నియమనిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో టూరిజం ఇన్ఛార్జ్ ప్రాంతీయ సంచాలకులు పవన్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 5, 2025
పిడింగొయ్యి: గుర్తు తెలియని వ్యక్తి మృతి

పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహాం ఉందని వీఆర్వో అప్పలనాయుడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హండ్రెడ్‌ఫీట్‌రోడ్డులో కల్వర్టు పక్కన గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్వి.రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 4, 2025
తూ.గో: ఇంటర్ పరీక్షకు 23,655 మంది విద్యార్థుల హాజరు

తూ.గో జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్-1 పరీక్షకు 23,655 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ఐఓ ఎల్ నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 51 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించగా జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 795 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆర్ఐఓ, డీవీఈఓ, ఫ్లయింగ్, సెన్సింగ్ స్క్వాడ్లు, కస్టోడియన్లు ఈ పరీక్షలను పర్యవేక్షించారన్నారు.
News March 4, 2025
జర్మనీలో తూ.గో. మంత్రికి ఘన స్వాగతం

జర్మనీ డి బెర్లిన్ ఎక్స్పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు జర్మనీలో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పర్యటక రంగంలో పెట్టుబడులు కోసం ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. మంత్రితో పాటు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పాల్గొంటారు.