News March 22, 2024
చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు: జిల్లా

అనకాపల్లి జిల్లాలోని 9 చెక్ పోస్టుల వద్ద పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ రవి పట్టం శెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణం నుంచి గ్రామాల వరకు ఎక్కడ ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. నియమావళి అమలు, పరిశీలన పట్ల అధికారులు నిశితంగా గమనించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పాల్గొన్నారు.
Similar News
News January 13, 2026
విశాఖ: 9 ట్రావెట్ బస్సులపై కేసు నమోదు

ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం కుర్మాన్నపాలెం వద్ద మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ బుచ్చిరాజు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 9 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించారు.
News January 13, 2026
విశాఖ: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తూ ప్రధాన నిందితులకు బ్యాంక్ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి మోసాలకు పాల్పడ్డారు. రంగారెడ్డికి చెందిన కనుకుట్ల సంతోష్ రెడ్డి, ఖమ్మంకు చెందిన అబ్బూరి గోపిలను అరెస్ట్ చేశారు.
News January 12, 2026
గ్రేటర్ విశాఖ బడ్జెట్ ఎంతంటే?

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌కు స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.4047.12 కోట్లుగా నిర్ణయించారు. ప్రారంభ నిల్వగా రూ.365.96 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం జమలు రూ.4180.37 కోట్లు కాగా, వ్యయం రూ.4047.12 కోట్లుగా అంచనా వేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ బడ్జెట్‌ను స్థాయి సంఘం ఆమోదించింది.


