News March 5, 2025

GWL: నీట్ యూజీ-2025 కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

image

జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో మే 4న నిర్వహించనున్న నీట్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బియం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గద్వాల్ పరిధిలోని ఎస్ఆర్. విద్యానికేతన్ (గద్వాల్), సరస్వతి స్కూల్ (ఎర్రవల్లి) పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. గదుల వసతులు సీటింగ్ ఏర్పాట్లు సీసీటీవీ పర్యవేక్షణ వెంటిలేషన్ తదిత అంశాలను పరిశీలించారు.

Similar News

News February 24, 2026

బ్రహ్మోత్సవాలను పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ఠంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో బ్రహ్మోత్సవాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News February 24, 2026

వీఆర్‌ఎస్-3లో ఉక్కు యాజమాన్యం వెనుకడుగు..?

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వీఆర్‌ఎస్-3 విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడో విడతకు 700 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 67 మందికే ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీఆర్‌ఎస్-1లో 1,126 మందికి, వీఆర్‌ఎస్-2లో 464 మందికి ఆమోదం లభించడంతో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. ఉత్పత్తిపై ప్రభావం పడుతోందనే వీఆర్‌ఎస్‌కు పరిమిత సంఖ్యలో యాజమాన్యం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

News February 24, 2026

భారత్ – బల్గేరియా ఫ్రెండ్షిప్ గ్రూప్.. సానా సతీశ్‌కు అరుదైన గౌరవం!

image

18వ లోక్ సభ కాలానికి సంబంధించి బల్గేరియాతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఏర్పాటయింది. ఇందులో సభ్యునిగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మంగళవారం నామినేట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటానని సానా సతీశ్ తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.