News March 5, 2025
లక్షెట్టిపేట: గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

లక్షెట్టిపేట పట్టణం ముల్కల్లగూడెంనకు చెందిన ముల్కల్ల సత్యనారాయణ(44) ఈత రాక ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందాడని ఎస్సై సతీష్ తెలిపారు. మంగళవారం ఉదయం సత్యనారాయణ గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడన్నారు. భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా సత్యనారాయణ కాగజనగర్ ఎస్సీ వసతి గృహంలో వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడని SI తెలిపారు.
Similar News
News November 13, 2025
సిరిసిల్ల జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా, అందులో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు, సీసీఐ ఆధ్వర్యంలో మరో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
News November 13, 2025
తరగతులను కొత్త భవనంలో నిర్వహించాలి: కలెక్టర్

బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత, ఆటిజం కేంద్రాల స్థలాన్ని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. పాత భవన తరగతులను వారం రోజుల్లో కొత్త భవనంలోకి మార్చాలని ఆదేశించారు. ఆటిజం కేంద్రం కోసం గదుల కేటాయింపులు, పరికరాల కొనుగోలుపై సూచనలు ఇచ్చారు. విద్యార్థుల క్రమశిక్షణపై దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
News November 13, 2025
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం: విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్లో చివరి గింజ కొనుగోలు వరకు అధికారులు రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025-26లో వరి, పత్తి, మక్కల కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు.


