News March 5, 2025

వరంగల్‌కు కొత్త పోలీస్ జాగిలాలు

image

నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్‌ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెల 28న పోలీస్‌ జాగిలాల శిక్షణా కేంద్రంలో 8 నెలల శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన 5 పోలీస్‌ జాగిలాలు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ డాగ్‌ స్వ్కాడ్‌లో చేరి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాయి.

Similar News

News March 20, 2026

బడ్జెట్‌లో వరంగల్‌కు అన్యాయం.. మంత్రి స్పందించాలి: బీజేపీ

image

బడ్జెట్లో వరంగల్ జిల్లాకు అన్యాయం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎం, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌కు ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఎయిర్ పోర్ట్, టెక్స్ టైల్ పార్క్, హైవే రోడ్ల మాటలేదని, గ్రేటర్ వరంగల్‌కు మరో సారి మొండిచెయ్యి చూపారని, దీనిపై జిల్లా మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.

News March 18, 2026

వరంగల్: రెండవ రోజు 99.9 శాతం విద్యార్థులు హాజరు

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రెండవరోజు వరంగల్ జిల్లాలో మొత్తం 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,482 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,473 మంది హాజరు కాగా 9 మంది గైర్హాజయ్యారు. మొత్తంగా హిందీ పరీక్షకు 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగలేదని డీఈవో రంగయ్య తెలిపారు.

News March 16, 2026

స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్‌మాల్‌

image

వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్‌ పర్సన్లు (ఆర్‌పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్‌పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.