News March 5, 2025
సూర్యాపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం చివ్వెంల మండలంలోని ఐలాపురం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ వంటగదిని సందర్శించి స్టాక్ రిజిస్టర్‌ని పరిశీలించి మాట్లాడారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News March 12, 2026
జిల్లాలో గ్యాస్ కొరత లేదు: తూ.గో కలెక్టర్

తూ.గో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. నిత్యం గృహ వినియోగదారులు, హాస్టళ్లు, ఆసుపత్రులకు 11 వేల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 14,829 సిలిండర్లు స్టాక్‌గా అందుబాటులో ఉన్నాయన్నారు. IOC, HPC, BPC ద్వారా సరఫరా సజావుగా సాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
News March 12, 2026
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, మున్సిపల్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
News March 12, 2026
అనకాపల్లి జిల్లాలో వారందరి ఖాతాల్లో రూ.134 కోట్లు జమ!

అనకాపల్లి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద 2,42,536 మంది లబ్ధి కలుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. వీరి ఖాతాల్లో ఈ నెల 13న రూ.134.27 కోట్లు జమ అవుతాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,202 మంది, చోడవరంలో 51,269, మాడుగుల 45,604, ఎలమంచిలి 33,648, నర్సీపట్నంలో 35,147, పెందుర్తి 15,364, పాయకరావుపేటలో 39,302 మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.


