News March 5, 2025
జనగామ జిల్లా పేరును నిలబెట్టాలి: కలెక్టర్

పాలకుర్తిలో 10వ తరగతి విద్యార్థులకు విజయోస్తూ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ భాషా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఒక ప్రధాన ఘట్టం అని, ఇందులో విజయం మీ జీవిత ప్రయాణంలో మరచిపోలేని ఒక జ్ఞాపకం అని తెలిపారు. ఈ తొలి గెలుపు బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.జిల్లా పేరును నిలబెట్టాలన్నారు.
Similar News
News November 24, 2025
NGKL: జిల్లాలో గత ఐదు రోజులుగా తగ్గిన చలి..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజులుగా చల్లి తీవ్రత తగ్గుతుంది. చారకొండ మండలం సిర్సనగండ్లలో 18.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి, అమ్రాబాద్ 18.7, వెల్దండ 18.8, ఎంగంపల్లి 19.0, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 19.1, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి 19.3, కుమ్మెర 19.5, ఊర్కొండ 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
News November 24, 2025
WGL: రీకౌంటింగ్.. తొలిసారి ఐదుగురు పాస్!

వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చరిత్రలో రీకౌంటింగ్ పెడితే తొలిసారి ఫెయిలైన ఐదుగురు పీజీ వైద్య విద్యార్థులు మళ్లీ ఉత్తీర్ణులు కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఈ విద్యార్థులు పాస్ కావడానికి, యూనివర్సిటీలో అక్రమంగా మార్కులు కలిపారని, డబ్బులు తీసుకొని పాస్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం గత నెల 4న ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కొనసాగుతోంది.
News November 24, 2025
తిరుచానూరులో పంచమి తీర్థం.. పటిష్ఠ భద్రత

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 25న మంగళవారం పంచమి తీర్థం జరగనుంది. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ, పోలీస్ శాఖ భద్రత కట్టుదిట్టం చేసింది. టీటీడీ విజిలెన్స్ 600 మంది, స్కౌట్ అండ్ గైడ్స్ 200 మంది, NCC విద్యార్థులు 200 మంది, శ్రీవారి సేవకులు 900 మంది, పోలీస్ సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.


