News March 5, 2025
భూపాలపల్లి: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డ కేసులో మంగళవారం నిందితుడు అట్టెం మల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానాను విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.నారాయణబాబు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో జిల్లా స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ రావు వాదనలు వినిపించగా పోలీసులు సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి శిక్ష పడింది.
Similar News
News March 21, 2026
పార్వతీపురం జిల్లాలో డిమాండుకు సరిపడా గ్యాస్ సరఫరా: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో డిమాండ్‌కి సరిపడా LPG గ్యాస్ సరఫరా జరుగుతోందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. వదంతులు నమ్మి అనవసరంగా నిల్వలు చేయొద్దని, దానివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందన్నారు. డిమాండ్, సప్లైలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.
News March 21, 2026
నేరాల నియంత్రణే లక్ష్యం: పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాహన సోదాలు నిర్వహించారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేశారు.
News March 21, 2026
వారంలో ఐపీఎల్.. ఆ ప్లేయర్లు ఆడటం డౌటే!

వారంలో IPL మొదలవనుండగా తమ క్రికెటర్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు మెలిక పెట్టింది. ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేందుకు NOC ఇవ్వాలంటే ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసవ్వాలని స్పష్టం చేసింది. DC ప్లేయర్లు చమీరా, నిస్సంక, కమిందు మెండిస్(SRH) ఫిజికల్ టెస్టును క్లియర్ చేశారు. గాయాల పాలైన హసరంగ(LSG), నువాన్ తుషార(RCB), పతిరణ(KKR), ఈషాన్ మలింగ(SRH) ఇంకా టెస్టులో పాల్గొనలేదు. దీంతో వీరు IPLలో పాల్గొనడంపై అనుమానం నెలకొంది.


