News March 5, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. 700 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.35,000, ప్రసాద విక్రయాలు రూ.6,73,650, VIP దర్శనాలు రూ.1,50,000, బ్రేక్ దర్శనాలు రూ.91,500, ప్రధాన బుకింగ్ రూ.31,112, కార్ పార్కింగ్ రూ.1,26,500, వ్రతాలు రూ.40,800, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.13,21,685 ఆదాయం వచ్చింది.
Similar News
News December 30, 2025
మాజీ ఎమ్మెల్యే మృతి

AP: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. అనారోగ్యంతో ఇటీవల తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రసాద్.. 2004లో అదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
News December 30, 2025
నెల్లూరు: ఆ ఘనత మనకే..!

గూడూరు, రాపూరు, సైదాపురం మండలాలను విలీనం చేయడం నెల్లూరు జిల్లాకు అనుకూలం. ఈ 3 మండలాల్లో అపారమైన ఖనిజ సంపద నెలకొని ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మైకా(అభ్రకం ) గనులు ఉన్న జిల్లాగా నెల్లూరుకు ఉన్న పేరు మరలా వచ్చింది. దీంతోపాటు క్వార్ట్జ్, తెల్లరాయి, గ్రావెల్ ఎక్కువగా ఉన్న సైదాపురం, రాపూరు మనకు రావడంతో జిల్లాకు ఆదాయం చేకూరనుంది.
News December 30, 2025
Money Tip: ఆపదలో ఆదుకునే ‘ఎమర్జెన్సీ ఫండ్’

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సడన్‌గా ఉద్యోగం పోయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చినా చేతిలో డబ్బు లేకపోతే చాలా కష్టం. అందుకే ‘ఎమర్జెన్సీ ఫండ్’ ఉండాలి. మీ నెలవారీ ఖర్చులు ఎంతవుతాయో లెక్కేయండి. దానికి కనీసం 6 రెట్లు అమౌంట్ ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఉదాహరణకు మీ ఖర్చు ₹25 వేలు అయితే ₹లక్షన్నర విడిగా ఉండాలి. ఈ డబ్బును వెంటనే చేతికి అందేలా ఇన్వెస్ట్ చేయడం బెస్ట్.


