News March 5, 2025
రికార్డ్స్ కంటే జట్టు గెలుపే ముఖ్యం: కోహ్లీ

తనకు వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు గెలుపే ముఖ్యమని టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఆసీస్‌తో మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఈ మ్యాచులో నేను సెంచరీ చేసుంటే బాగుండేది. కానీ జట్టు గెలుపు అంత కన్నా ముఖ్యం. మైలురాళ్ల గురించి పట్టించుకోకుంటేనే అవి దక్కుతాయి. సెంచరీ మిస్సైందనే బాధ ఏమాత్రం లేదు. ఈ ఇన్నింగ్స్‌లో నేను తీసిన సింగిల్స్ సంతోషాన్ని ఇచ్చాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 5, 2025
విరాట్ కోహ్లీ మరో ఘనత

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో విరాట్ 746 పరుగులు చేశారు. ఈ క్రమంలో శిఖర్ ధవన్ (701) రికార్డును చెరిపేశారు. వీరి తర్వాత గంగూలీ (665), ద్రవిడ్ (627) ఉన్నారు. అలాగే 2000 తర్వాత వన్డేల్లో అత్యధిక సింగిల్స్ తీసిన ప్లేయర్‌గా కోహ్లీ (5,868) నిలిచారు. ఆయన తర్వాత సంగక్కర (5,688) ఉన్నారు.
News March 5, 2025
ఇవాళ్టి ఎగ్జామ్‌కు ఎంపిక చేసిన సెట్ ఇదే

ఏపీలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ సబ్జెక్టు పరీక్ష ఉంది. దీనికి సెట్ నెంబర్ 1 ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.
News March 5, 2025
ఇంటర్ విద్యార్థులకు BIG ALERT

AP: ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్‌లో మాత్రమే తీసుకుని రావాలని అధికారులు సూచించారు. కలర్ ప్రింట్‌తో తీసుకొస్తే పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. వెబ్‌సైట్, వాట్సాప్‌లలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉండటంతో కొందరు కలర్ పేపర్లపై ప్రింట్లు తీసుకొస్తున్నారని తెలిపారు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి.