News March 5, 2025
భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.
Similar News
News March 5, 2025
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అల్లూరి జేసీ ఆరా..!

తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై జేసీ, ఇన్ ఛార్జ్ ఐటీడీఏ పీవో డాక్టర్ ఎం.జే అభిషేక్ గౌడ ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాక్ రూమ్, వంట గదిని పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం మంచి ఆహారం అందించాలని ఆదేశించారు.
News March 5, 2025
దాచేపల్లి: సచివాలయ ఉద్యోగి వీడియో.. స్పందించిన లోకేశ్

పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బులతో పారిపోయాడు. ఈ మేరకు నిన్న క్షమించండి, డబ్బులు కట్టేస్తానంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. మనుషులుగా తప్పులు చేస్తుంటాం, కానీ వాటి నుంచి మంచి నేర్చుకోవటం ముఖ్యం. మీ కుటుంబానికి తొలి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లకండి అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
News March 5, 2025
గరుగుబిల్లిలో వ్యక్తి ఆత్మహత్య

గరుగుబిల్లి మండలానికి చెందిన నాగల్ల సింహాచలం( 56) ఆత్మహత్య చేసుకున్నట్లు కొమరాడ ఎస్సై నీలకంఠం తెలిపారు. ఎస్ఐ కథనం.. మృతుడు గొర్రెల కాపరి. తన కుమారుని వైవాహిక జీవితం సరిగా లేకపోవడంతో మనస్తాపంతో మంగళవారం కొమరాడ మండలం గుమడ గ్రామ దరి గొర్రెల మంద విషం తాగి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.