News March 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News March 5, 2025

‘ఇంకెంత కాలం సాగాలి?’.. తెలంగాణ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు

image

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ MLAల పదవీకాలం ముగిసేంత వరకూ సాగాలా? అని ప్రశ్నించింది. ఇలాగే జరిగితే ప్రజాస్వామ్యం ఏం కావాలని నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, EC, ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25కి విచారణ వాయిదా వేసింది.

News March 5, 2025

సింగర్ కల్పన హెల్త్ UPDATE

image

నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారని తెలిపారు. అటు <<15653135>>కల్పన<<>> ఆత్మహత్యాయత్నం వెనుక ఆమె రెండో భర్త ప్రసాద్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. మరోసారి కల్పన ఇంట్లో తనిఖీలు కూడా చేపట్టారు. మరోవైపు తాను పనిమీద రెండు రోజుల క్రితం బయటకు వెళ్లినట్లు పోలీసులకు ప్రసాద్ తెలిపారు.

News March 5, 2025

మీనాక్షి స్వీట్ వార్నింగ్

image

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని TPCC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరి తీరుపై అసంతృప్తి ఉన్నా అంతర్గత సమావేశాల్లో చెప్పాలన్నారు. మీడియా ముందు, సోషల్ మీడియాలో వాటిని చెప్పొద్దని హెచ్చరించారు. సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదని మెదక్ పార్లమెంట్ స్థానం స్థాయి భేటీలో సీనియర్లు వాపోయారు. దీంతో పదేళ్లకు పైగా పని చేసిన వారికి పీసీసీలో చోటు కల్పిస్తామని మీనాక్షి హామీ ఇచ్చారు.

error: Content is protected !!