News March 22, 2024
తీర్పు రిజర్వ్
లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు లాయర్ రాజు సుదీర్ఘ వాదనలు వినిపించారు.
Similar News
News November 26, 2024
ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రీకాకుళం కుర్రాడు.. కేంద్ర మంత్రి విషెస్
AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన త్రిపురాణ విజయ్ ఐపీఎల్‌లో చోటు దక్కించుకోవడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. విజయ్ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కొత్త అధ్యాయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు Xలో రాసుకొచ్చారు. కాగా విజయ్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైజ్ చెల్లించి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
News November 26, 2024
IPL: మెగావేలంలో ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేశాయంటే?
ఐపీఎల్ మెగావేలంలో 10 ఫ్రాంచైజీలు రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 182 మంది ప్లేయర్లు వేలంలో అమ్ముడుపోగా వీరిలో 62 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 8 మంది ఆటగాళ్లను RTM ద్వారా ఆయా జట్లు దక్కించుకున్నాయి. అత్యధికంగా పంజాబ్ 23 మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా, అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ 14 మందిని వేలంలో దక్కించుకుంది. ఇంకా ఆర్సీబీ వద్ద అత్యధికంగా రూ.75 లక్షలు మిగిలి ఉన్నాయి.
News November 26, 2024
ఢిల్లీ వెళ్లింది అందుకే: ఫడణవీస్
ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడంపై మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లానని, రాజకీయాల గురించి కాదని మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ ఆయన ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎంగా బాధ్యతలు ఎవరు చేపడుతారనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.