News March 5, 2025

నిర్మల్: బడులకు ల్యాప్‌టాప్‌లు వచ్చాయ్…!

image

జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన ల్యాప్‌టాప్‌లను మంగళవారం డీఈవో రామారావు ఉపాధ్యాయులకు అందజేశారు. జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక కాగా 17 పాఠశాలలకు టింకరింగ్ ల్యాబ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వీటి కింద 17 పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు వచ్చాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News March 5, 2025

వికారాబాద్: నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

image

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 7,914 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్ బోర్డు మోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. గంట ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలన్నారు.

News March 5, 2025

మెదక్: మహిళపై అత్యాచారం.. ఆపై హత్య

image

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని కల్లు షాప్ నుంచి నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి, చున్నీ ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.

News March 5, 2025

వనపర్తి జిల్లాలో వ్యక్తి మృతి

image

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. హీర్లతండాకు చెందిన హరిచంద్, వాలీబాయి భార్యభర్తలు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన హరిచంద్ రాత్రి ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందనట్లు వారు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!