News March 5, 2025

మెదక్: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

image

మెదక్ జిల్లా నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్మట్ పల్లి- చిల్వర్ మధ్యలో హైవే బ్రిడ్జిపై రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అల్లాదుర్గంకు చెందిన బండ సాయిలు (55), మణెమ్మగా గుర్తించారు. బొడ్మట్ పల్లి సంతలో కూరగాయలు అమ్మి ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది.

Similar News

News March 22, 2026

మెదక్: 24న కలెక్టరేట్ ఎదుట నిరసన: టీపీటీఎఫ్

image

ఈనెల 24న మెదక్ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి కోరారు. విద్యా రంగానికి నిధులను 20 శాతానికి పెంచాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, రెగ్యులర్ డీఈఓ పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఎంఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

News March 21, 2026

రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి: మెదక్ కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన రైతు ఉత్సవాల’ కార్యక్రమంలో మెదక్ జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం నర్మెటలో జరిగే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుంచి 2,650 మంది రైతులను తరలించేందుకు 53 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 21, 2026

మెదక్: ఈసారీ నిరాశే !

image

రాష్ట్ర బడ్జెట్‌ మెదక్ జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. మెతుకుసీమలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ ఎత్తు పెంపు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. నూతనంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో జిల్లాలోని 1.68 లక్షల కుటుంబాలకు బీమా వర్తించనుంది. కాళేశ్వరం కెనాల్స్ పనులకు నిధులు లేవు, మెదక్ బైపాస్ రోడ్డు ప్రస్తావనేలేదు. బడ్జెట్‌‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.