News March 5, 2025
పెంచికల్పేట్: అనుమానంతోనే హత్య చేశాడు: CI

లోడుపల్లికి చెందిన గుర్లే లలిత పంట చేనులో హత్య విషయం తెలిసిందే. CI శ్రీనివాసరావు, SI కొమురయ్య కథనం ప్రకారం.. భర్త గణేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆదివారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. పథకం ప్రకారం మామిడి తోటలో ఆమెను తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులకు ఎదుట అంగీకరించాడు.
Similar News
News March 7, 2026
నల్గొండ: సివిల్స్‌లో సత్తా చాటిన బ్రదర్స్

చిట్యాల మండలం సుంకెనపల్లికి చెందిన అన్నదమ్ములు విక్రమసింహారెడ్డి, విజయసింహారెడ్డి సివిల్స్‌లో సత్తా చాటారు. ఫలితాల్లో విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు, విజయసింహారెడ్డి 682వ ర్యాంకు సాధించారు. వీరి తండ్రి అంజిరెడ్డి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి కాగా, తల్లి అలివేలు గృహిణి. ప్రస్తుతం వీరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎంపీడీవోలుగా పనిచేస్తూనే ఈ ఘనత సాధించడం విశేషం.
News March 7, 2026
నల్గొండ: థియేటర్లో పార్కింగ్ ఫీజు ఇవ్వకండి..!

థియేటర్ల పార్కింగ్ దందాపై హైకోర్టు కొరడా ఝుళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121వ జీవోను సస్పెండ్ చేస్తూ ప్రేక్షకులకు భారీ ఊరటనిచ్చింది. వ్యాపార ప్రయోజనాల కంటే వినియోగదారుల హక్కులే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఉమ్మడి NLGలో సుమారు 30 వరకు సింగిల్ స్ర్కీన్స్ థియేటర్లు ఉన్నాయి.
News March 7, 2026
ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు ఎప్పుడంటే

కృష్ణా యూనివర్శిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 3, 4, 5, 7వ సెమిస్టర్ (వన్ టైం ఆపర్చునిటీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి 31 మధ్య నిర్ణీత తేదీలలో వర్శిటీ పరిధిలోని 2 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.


