News March 5, 2025

OUలో వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ రెగ్యులర్ పరీక్ష ఫలితాలతో పాటు డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.

Similar News

News November 9, 2025

HYD: సైకో పోవాలి.. సారే రావాలి: రైతు సురేశ్

image

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్‌లో KTR రోడ్ షో నిర్వహించారు. బైపోల్ సందర్భంగా నగరంలో రకరకాల ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిన్న BRS రోడ్ షోలో వనస్థలిపురం వారిది ‘రప్ప రప్ప’ పోస్టర్ కనిపించగా, ఇవాళ ‘సైకో పోవాలి..సారే రావాలి’ అనే క్యారీక్రేచర్ పోస్టర్‌ను రైతు సురేశ్ ప్రచారం రథం వద్ద ప్రదర్శించారు. ఏదేమైనా ఇరుపార్టీల బ్యానర్‌ల పంచాయితీ తారస్థాయికి చేరింది.

News November 9, 2025

HYD: అవినీతి పాలనకు ముగింపు పలకాలి: BJP

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళ్‌రావునగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా BRS పాలనలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ HYD అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలు ఈసారి అవినీతి, మోసపూరిత పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

News November 9, 2025

రాయదుర్గం PSలో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

image

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని గోపీనాథ్ మృతి ఆయన తల్లి రాయదుర్గం PSలో ఫిర్యాదు చేశారు. మాగంటి మహనంద కుమారి కుమారుడు మరణంపై పోలీసులు దర్యాప్తు చెయ్యాలని సూచించారు. మృతికి సంబంధించి మొదటి నుంచి తల్లి మహానందకుమారి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే.