News March 5, 2025
రామప్ప: ఈ బావి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల రామప్ప ఆలయ ఆవరణలో ఉన్న కాకతీయుల కాలంనాటి బావి నేటి వరకు చెక్కుచెదరకుండా ఉంది. సుమారు 800 ఏళ్ల క్రితం తవ్విన ఈ బావి గోడలు పొడవైన, వెడల్పైన శిలలతో నిర్మించారు. ఈ బావిలోని నీటిని తాగితే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. రామప్ప ఆలయ నిర్మాణానికి వాడిన ఇటుకలు ఈ నీటిలో వేస్తే తేలుతాయి. రామప్ప సందర్శించిన పర్యాటకులు ఈ బావిని చూసి మంత్రముగ్ధులవుతారు.
Similar News
News November 15, 2025
సంగారెడ్డి: కన్నతల్లిని హతమార్చిన కొడుకు

కోహీర్ మండలం బడంపేటలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు బాలరాజ్ తల్లిని హత్య చేశాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన బాలరాజ్ డబ్బుల కోసం 3 రోజుల నుంచి తల్లి పద్మమ్మ (52)తో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంతో తల్లిని గోడకు కొట్టాడు. దీంతో స్పాట్‌లోనే మృతి చెందింది. బాలరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 15, 2025
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో ఛాన్స్

AP: 2026లో జరగనున్న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. అయితే రూ.2 వేల ఫైన్‌తో నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా చెప్పారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఫెయిలైన, ప్రైవేట్ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఫీజు చెల్లింపునకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.
News November 15, 2025
CII సమ్మిట్.. శ్రీసిటీలో మరో 5 ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

CII సమ్మిట్‌లో మరో 5 ప్రాజెక్ట్‌లను CM చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతి (D) శ్రీసిటీలో ఈ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నట్లు CM చెప్పారు. పార్క్‌లో ఇప్పటికే 240 యూనిట్లు ఉండగా.. వెర్మీరియన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్మ్‌వెస్ట్ మిరాయ్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, థింక్ గ్యాస్, ఆన్‌లోడ్‌గేర్స్ ఎక్స్‌పోర్ట్స్, యూకేబీ ఎలక్ట్రానిక్స్ ఈ లిస్ట్‌లో చేరనున్నాయి.


