News March 5, 2025
అర్హుల ఎంపికను పూర్తి చేయాలి: హనుమకొండ కలెక్టర్

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకానికి జిల్లాలో ఎంతమంది ఎంపికయ్యారని, ఎన్ని దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయనే, తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 6, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES…

✷ TPG: జగన్‌పై ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్ ✷ భీమవరం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రా ✷మాజీ ఎమ్మెల్యే పాడె మోసిన తణుకు ఎమ్మెల్యే ✷ ప.గో: నిధులు వినియోగంలో ఏపీఐఐసీ తీవ్ర జాప్యం✷ నరసాపురంలో 8 కేజీల వెండి చోరీ ✷అత్తిలి: స్నేహితుల మధ్య ఘర్షణ..వ్యక్తి హత్య✷ నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య✷ ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం ✷ కాళ్ల: ఎమ్మెల్సీ పేరాబత్తులను అభినందించిన RRR
News March 6, 2025
విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

➤ చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు➤ విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ➤ విశాఖలో రేపే మద్యం దుకాణాల వేలం➤ తాటిచెట్లపాలెం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి➤ సింహాచలం దేవస్థానం హుండీ ఆదాయం రూ.1,85,22,270 ➤ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు ➤విశాఖలో 29.2 కిలో మీటర్ల మేర ఇంటర్నల్ రోడ్లు నిర్మాణం
News March 6, 2025
పోరాట సింహం.. ‘మిల్లర్’ కిల్లర్

కివీస్‌తో CT సెమీస్‌లో SA ఓడినా మిల్లర్ చేసిన పోరాటం సగటు క్రికెట్ అభిమాని మనసును గెలిచింది. లక్ష్యం అందనంత దూరంలో ఉన్నా జట్టును గెలిపించాలనే కసితో చేసిన ప్రయత్నం అసామాన్యం. మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోయినా ఫోర్లు, సిక్సులతో కివీస్ బౌలర్లపై కనికరం లేకుండా చెలరేగారు. ఈ క్రమంలో చివరి 25 బంతుల్లో 54 రన్స్ చేశారు. మరో 3ఓవర్లు ఉంటే మిల్లర్ మ్యాచ్‌ను గెలిపించేవారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.