News March 5, 2025
ఆదోనికి ‘పోసాని’.. కేసు ఇదే!

గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని <<15649438>>ఆదోని<<>> పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జనసేన నేత రేణువర్మ ఫిర్యాదు మేరకు పోసానిపై గతేడాది ఆదోని త్రీ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ను అసభ్య పదజాలంతో దూషించారన్న ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీంతో పీటీ వారంట్‌పై పోసానిని ఆదోనికి తరలించారు.
Similar News
News March 11, 2026
కర్నూలు జిల్లా రైతులకు తీపి కబురు

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సహాయం ఈ నెల 13న విడుదల కానుందని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన రైతులకు రూ.6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,72,757 మంది లబ్ధిదారులకు రూ.154.94 కోట్లు అందుతాయని జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. ఈ నిధులు డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు చేరుతాయి.
News March 11, 2026
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 153 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 153 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,242 మందికి గానూ 4,089 మంది మాత్రమే హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
News March 11, 2026
OTPలు ఎవరికీ చెప్పకండి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు RBI రూపొందించిన పోస్టర్లను జేసీ నూరుల్ ఖమర్ ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ.. ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు ‘డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్’ నిర్వహిస్తున్నామన్నారు. బ్యాంక్ అధికారులమని చెప్పినా ఎవరికీ OTP చెప్పకూడదన్నారు. కేవలం బ్యాంక్ అధికారిక యాప్స్, వెబ్‌సైట్ల ద్వారానే లావాదేవీలు చేయాలన్నారు.


