News March 5, 2025
కొత్తగూడెం: రూ.10.30లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం టౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో 2 ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద రూ.10.30 లక్షలు విలువ గల 20 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వీరంతా సుక్మా జిల్లాకు చెందిన వారిగా విచారణలో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
జనగామ మాజీ ఎమ్మెల్యే ఆస్తుల అటాచ్!

జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. జనగామలోని ఆరు ప్లాట్లు, చేర్యాలలోని స్థలాలను ఈ పరిధిలోకి తెచ్చారు. గతంలో ఈ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి తనకు ఏమీ తెలియదని, తండ్రి చెప్పడంతోనే సంతకాలు చేశానని భవానీ రెడ్డి ఐటీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
News January 13, 2026
పిండివంటల కోసం ఈ చిట్కాలు

* పిండి వంటలు చేసేటపుడు నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
* వంటగది గట్టు మీద జిడ్డు పోవాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.
*వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.
News January 13, 2026
మెదక్ జిల్లాలో మహిళలదే హవా !

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 45,168 మంది ఉండగా, పురుష ఓటర్లు 42,015 మంది ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 19,406, తూప్రాన్ 10,302, నర్సాపూర్ 8,656, రామాయంపేట 6,804 మహిళా ఓటర్లు ఉండగా, మెదక్ 17,548, తూప్రాన్ 9,957, నర్సాపూర్ 8,219, రామాయంపేట 6,291 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్‌లో ఒక్కొక్క ఓటరు ఇతరులు ఉన్నారు.


