News March 5, 2025
మంచిర్యాల జిల్లాలో 23 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,540 మంది పరీక్ష రాయనున్నారు.
Similar News
News March 22, 2026
గద్వాల: రోడ్డు ప్రమాదం.. మృతులు కర్ణాటక వాసులు

బలిగేర శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వరికోత పనులు ముగించుకుని బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొన్నారు. మృతులు దేవునిపల్లికి చెందిన తిమ్మప్ప (35), ఓగులప్ప (40)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 22, 2026
VZM: విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల అనంతరం ఖాళీ సమయంలో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు వంటి జలవనరుల వద్దకు వెళ్లే అవకాశముండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలని ఆయన కోరారు.
News March 22, 2026
కర్నూలు: ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడి మృతి

గోనెగండ్ల మండలం వేముగోడులో మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రవిరెడ్డి పొలంలో కాంట్రాక్టర్ బావన్న నీళ్ల బావిని JCBతో తవ్వుతూ మట్టిని ట్రాక్టర్‌లో నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ, ఇంజన్‌కు మధ్య ఉన్న లింక్ తెగిపోయింది. దీంతో ట్రాక్టర్‌పై కూర్చున్న సాదిక్ బాషా(19) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


