News March 5, 2025
అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు 1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 4, 2026
‘జనగణనను పారదర్శకంగా నిర్వహించండి’

అనంతపురం జిల్లా జనగణనను అధికారులు, సిబ్బంది బాధ్యతగా చేపట్టాలని డిఆర్ఓ, జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. జేఎన్టీయూలో జరిగిన శిక్షణలో డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు. సీఎంఎంఎస్ ద్వారా 33 అంశాల నమోదు, మొబైల్ యాప్ వినియోగంపై వివరించారు. ఎక్కడా లోపాలు లేకుండా జనగణన పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.
News March 4, 2026
పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై దుష్ప్రచారం

ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1993 డిసెంబర్ 21న పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన ఘటనను తాజాగా జరిగినట్టుగా, బంగారు విగ్రహాల విలువ రూ.150 కోట్లుగా వక్రీకరిస్తున్నారు. అయితే అప్పట్లోనే ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విగ్రహాల విలువ రూ.50 వేలుగా నమోదు చేసి, 1994లో కేసు మూసివేశారు.
News March 4, 2026
అనంతపురంలో పడిపోయిన ధరలు

చీనీ, టమాటా ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.25,000, కనిష్ఠంగా రూ.8 వేల ధర పలికింది. అనంతపురం శివారులోని కక్కలపల్లి టమాటా బండిలో క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.8 వేలు, కనిష్ఠంగా రూ.4 వేల ప్రకారం ధర పలికింది.


