News March 5, 2025
VJA: బంగారు నగల కోసం హత్య.. జీవిత ఖైదు

నగలు కోసం వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గుణదలకు చెందిన ఓ వృద్ధురాలిని 2014లో హత్య చేసి బంగారం చోరీ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు తోట్లవల్లూరుకు చెందిన బుజ్జి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయగా విజయవాడ న్యాయస్థానం జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నాగేశ్వరావు తీర్పు చెప్పారు.
Similar News
News March 6, 2025
అవసరమైతే పోలీసులను వినియోగించుకుంటాం: కలెక్టర్

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణాలపై ముద్రించిన పోస్టర్లను తన ఛాంబర్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల కార్మికులను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే దీనికోసం పోలీసులను కూడా వినియోగించుకుంటామన్నారు.
News March 6, 2025
మెదక్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
News March 6, 2025
ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకూ అవకాశముందన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.