News March 5, 2025

ములుగు: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

ములుగు జిల్లా వ్యాప్తంగా 3,793 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 1,950, సెకండియర్‌లో 1,843 మంది విద్యార్థులు రాయనుండగా.. 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST

Similar News

News March 6, 2025

బ్యాంకులకు RBI శుభవార్త

image

నిధుల్లేక నైరాశ్యంతో ఉన్న బ్యాంకులకు ఉత్తేజం తెచ్చేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.2లక్షల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సెక్యూరిటీల కొనుగోలు, డాలర్-రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో రూ.1.9లక్షల కోట్లు తీసుకురావాలని భావిస్తోంది. ఈ నెల 12, 18 తేదీల్లో రూ.1లక్షల కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది.

News March 6, 2025

నిర్మల్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.

News March 6, 2025

KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.

error: Content is protected !!