News March 5, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఐదుగురు హీరోయిన్లు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్‌గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. అమెరికన్, కొరియన్ హీరోయిన్లను కూడా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమా కోసం బన్నీ విదేశీ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు.
Similar News
News March 6, 2025
ఈనెల 8న మహిళాశక్తి పాలసీ విడుదల

TG: ఈనెల 8న జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని, మజ్జిగప్యాకెట్లు అందించాలని అధికారులను ఆదేశించారు.
News March 6, 2025
జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

కశ్మీర్‌లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్, గాందర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.
News March 6, 2025
మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు

పాకిస్థాన్ క్రికెటర్ సౌద్ షకీల్ అరుదైన రీతిలో ఔటయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిద్ర పోయి క్రీజులోకి రాకపోవడంతో ఆయన టైమ్డ్ అవుట్ అయ్యారు. పాకిస్థాన్ టెలివిజన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ జట్టు ఆటగాడు షకీల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. 3 నిమిషాలలోపు అతడు బ్యాటింగ్‌కు రాకపోవడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ సహా మొత్తం నలుగురు ఔటయ్యారు.