News March 5, 2025
దాచేపల్లి: సచివాలయ ఉద్యోగి వీడియో.. స్పందించిన లోకేశ్

పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బులతో పారిపోయాడు. ఈ మేరకు నిన్న క్షమించండి, డబ్బులు కట్టేస్తానంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. మనుషులుగా తప్పులు చేస్తుంటాం, కానీ వాటి నుంచి మంచి నేర్చుకోవటం ముఖ్యం. మీ కుటుంబానికి తొలి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లకండి అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
Similar News
News September 16, 2025
నిర్మల్: ‘రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

పట్టణంలోని ప్రభుత్వ మాత, శిశు ఆసుపత్రిని కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మహిళా శక్తి క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు సేకరించారు. అనంతరం లాబొరేటరీ, స్కానింగ్ కేంద్రం, ఇన్‌వార్డు, అవుట్‌వార్డు, ఆపరేషన్ థియేటర్, ఓపి వార్డు, బాలింతల వార్డులను సందర్శించి రోగుల పరిస్థితి స్వయంగా పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
News September 16, 2025
గుండెపోటుతో డోన్ ఆర్పీఎఫ్ ఎస్‌ఐ మృతి

డోన్ రైల్వే స్టేషన్‌లో విషాదం నెలకొంది. ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ నాయక్ గుండెపోటుతో మృతిచెందారు. సామాజిక సేవలోనూ ముందుండే లక్ష్మణ్ నాయక్ మరణ వార్త కుటుంబ సభ్యులు, సహచరులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
WNP: ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

టీజీఎస్ ఆర్టీసీ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు బస్సులను బుక్ చేసుకుని ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ పాల్గొన్నారు.