News March 5, 2025

సూర్యాపేట జిల్లాలో 32 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

సూర్యాపేట జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 16,948 మంది పరీక్ష రాయనున్నారు.

Similar News

News November 7, 2025

నవీన్ యాదవ్‌పై ఈసీకీ బీఅర్ఎస్ ఎంపీల ఫిర్యాదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి BRS MPలు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

News November 7, 2025

ఆత్మకూరు: గుర్తు తెలియని శవం లభ్యం

image

తిప్పడం పల్లి సమీపంలో ఊక చెట్టు వాగు ఒడ్డున గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఆత్మకూరు ఎస్సై జయన్న తెలిపారు. ఆత్మకూరు రెవెన్యూ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పరుశరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండొచ్చన్నారు. ఆకుపచ్చ టీ షర్ట్ ధరించి ఉన్నాడని, శవాన్ని గుర్తుపట్టిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు.