News March 5, 2025
పెద్దపల్లి: నేడే పరీక్షలు.. ALL THE BEST

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 10,985 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 5,844, సెకండియర్‌లో 5,141 మంది విద్యార్థులు రాయనుండగా.. 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST
Similar News
News March 25, 2026
KNR: ఆయిల్ పామ్ లక్ష్యం ‘లక్షల్లో’.. సాగు ‘వేలల్లో’

ఉమ్మడి KNR(D)లో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 2022-26 నాలుగేళ్ల కాలానికి 1.30 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు సాధించింది కేవలం 11,900 ఎకరాలు మాత్రమే. PDPL 45,000 ఎకరాల లక్ష్యానికి గానూ 3,000 ఎకరాల్లోనే సాగు. KNR 45,000 గాను 2,200 ఎకరాల్లోనే సాగు. JGTL 8,500- 4,500. SRCL 8,500- 2,200 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
News March 25, 2026
చిన్న నియోజకవర్గం.. గొప్ప అభివృద్ధి

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. దీనివల్ల ఒక్కో MP పరిధిలోని జనాభా 30 లక్షల నుంచి 15 లక్షలకు తగ్గుతుంది. చిన్న నియోజకవర్గాల వల్ల MPలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తారు. ఫలితంగా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు MP నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పు క్షేత్రస్థాయి అభివృద్ధికి, యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావడానికి అవకాశంగా నిలుస్తుంది.
News March 25, 2026
నర్సాపూర్: స్వయంభూగా కొలువైన సీతారామసమేత ఆలయం

స్వయంభు ఏకాంతంగా వెలిసిన సీతారామ స్వామి ఆలయంగా పేరు పొందుతున్న నర్సాపూర్ పట్టణ సమీపంలోని సీతారాంపూర్లో ప్రతిఏటా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పూజారి హరిప్రసాద్ శర్మ తెలిపారు. 600 ఏళ్ల క్రితం కాకతీయులు ఆలయం నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సీతారామసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఉత్సవాల గురించి ఆయన వే2న్యూస్‌తో తెలిపారు. ఉదయగిరి చుట్టూ బండ్ల ప్రదక్షిణలు నిర్వహిస్తారన్నారు.


