News March 5, 2025
యాదాద్రి భువనగిరి జిల్లాలో 29 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,558 మంది పరీక్ష రాయనున్నారు.
Similar News
News March 6, 2025
రూ.50లక్షలు, అర కేజీ బంగారం, బెంజ్ కారు కావాలంటూ..

ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కుటుంబసభ్యులను గొంతెమ్మ కోర్కెలు కోరాడో వరుడు. వివాహానికి ముందురోజు రాత్రి రూ.50 లక్షల నగదు, అర కేజీ బంగారం, ఒక బెంజ్ కారు కావాలంటూ పేచీ పెట్టాడు. అతని పేరెంట్సూ ఇందుకు వంతపాడారు. వధువు తండ్రి తాను ఇవ్వలేనని చెప్పడంతో చెప్పాపెట్టకుండా వరుడి ఫ్యామిలీ పరారైంది. ఈ ఘటన బెంగళూరులో జరగగా, వరుడు ప్రేమ్, అతని పేరెంట్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 6, 2025
ఎస్.రాయవరం: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్‌లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
News March 6, 2025
గూడూరు: ‘ఇసుకలో తల ఇరుక్కొని చనిపోయాడు’

MHBD జిల్లా గూడూరు మండలం చిర్రకుంట తండాలో బుధవారం వ్యక్తి మరణించడంతో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంటతండాకు చెందిన భూక్య రాజ్ కుమార్ తన వ్యవసాయ పంట పొలాల్లో కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్నాడు. కాగా, కోతులు ఆవాసం ఏర్పరచుకున్న చెట్టు కొమ్మలను నరికి వేసే క్రమంలో చెట్టు పైనుంచి జారిపడ్డాడు. చెట్టు కింద వాగు ఇసుకలో తల కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.