News March 5, 2025
వికారాబాద్: 144 సెక్షన్ అమలు: ఎస్పీ నారాయణరెడ్డి

నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల చుట్టూ జిరాక్స్, ఆన్‌లైన్ సెంటర్లు మూసివేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు.
Similar News
News March 1, 2026
OMG.. HYDలో భారీ LIVE FISH

నగర శివారు కీసరలోని గోషాల వద్దగల చెరువులో భారీ చేప జాలరుల వలకు చిక్కింది. ఓ వ్యక్తి ఆదివారం సరదగా అలా చెరువు వద్దకు వెళ్లాడు. 14కేజీల భారీ చేప చిక్కను కిలోల లెక్కన కొనుగోలు చేశాడు. దీంతో కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. పక్కనే గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్స్, స్థానికులు ఈ చేపను ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మీరెప్పుడైనా ఇంత పెద్ద చేపను లైవ్‌లో చూశారా?
News March 1, 2026
BHPL: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఫలితాల్లో గౌతమ్ ప్రతిభ

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష(AISSEE) ఫలితాల్లో జయకేతనం ఎగిరేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం గౌతమ్ సత్తా చాటారు. 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో గౌతమ్ రికార్డు స్థాయి ర్యాంకులతో జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 240వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబర్చాడు.
News March 1, 2026
ప్రకాశం: యువతి ఏకాంత వీడియోలతో బ్లాక్‌మెయిల్

వివాహిత పర్సనల్ వీడియోలు ఆమె భర్త, తండ్రికి పంపి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై గుంటూరు PSలో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. కొరిటెపాడుకి చెందిన ఓ యువతి, ప్రకాశం (D) యువకుడు కళాశాల రోజుల్లో ప్రేమించుకున్నారు. ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ ప్రియుడు ప్రేమించే సమయంలో యువతిని ఏకాంతంగా కలిసిన వీడియోలను భర్త, తండ్రికి పంపాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


