News March 5, 2025

ADB: మీనాక్షి MEETING.. శ్రేణులు WAITING

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ బుధవారం ఆదిలాబాద్ పార్లమెంటరీ సమావేశాన్ని HYD గాంధీభవన్‌లో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఆమె నివేదిక తెప్పించుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మీటింగ్‌లో పాల్గొననుండడంతో ఆమె ఏం చెబుతారోనని శ్రేణులు వెయిట్ చేస్తున్నారు. మీ కామెంట్?

Similar News

News March 3, 2026

విశాఖ: బర్త్‌డే.. డెత్‌ డే

image

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు <<19282896>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై ధర్మేందర్ తెలిపారు.

News March 3, 2026

ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

image

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.

News March 3, 2026

సంగారెడ్డిలో సదరం శిబిరాల షెడ్యూల్‌ విడుదల

image

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన ‘సదరం’ శిబిరాల షెడ్యూల్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్‌ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీల్లో ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు తగు ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.