News March 5, 2025
MHBD: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: SP

MHBD జిల్లా కేంద్రంలో బుధవారం జరగనున్న ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల 163 BNNS(144సెక్షన్) అమలులో ఉండనుందని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ఈనెల 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 6, 2025
సంగారెడ్డి: మతిస్తిమితం లేని యువతిపై అత్యాచారం

మతిస్తిమితం సరిగ్గాలేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆందోల్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి(24) చిన్ననాటి నుంచి మతిస్తిమితం లేక పోవడంతో కుటుంబీకులు ఆమెకు పెళ్లి చేయలేదు. యువతి ప్రతిరోజు గ్రామంలో అటు ఇటూ తిరిగి ఇంటికి చేరుకునేది. నాలుగు రోజుల క్రితం శంకర్ అనే యువకుడు మద్యం మత్తులో యువతిని పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
News March 6, 2025
కరీంనగర్: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు శుభవార్త తెలిపారు. కరోనా సమయంలో రద్దు చేసిన బల్లార్షా-కాజీపేట-బల్లార్షా మధ్యలో నడుస్తున్న రైలు నంబర్ 17035,17036 ప్యాసింజర్ తిరిగి ఈ నెల 6 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి రాజనర్సు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, ఉప్పల్, బిజిగిరిషరిఫ్ ప్రాంతాలవాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
News March 6, 2025
జగిత్యాల: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.