News March 5, 2025
నల్గొండ: నేడే పరీక్షలు.. ALL THE BEST

రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28,722 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 13,992 సెండియర్లో 14,730 మంది విద్యార్థులు రాయనుండగా.. 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి. ALL THE BEST
Similar News
News March 6, 2025
NLG: పెరుగుతున్న హనీట్రాప్ బాధితులు!

నల్గొండ జిల్లాలో హనీట్రాప్ బాధితులు పెరుగుతున్నారు. పరువుపోతుందనే భయంతో వారు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బ్లాక్ మెయిలింగ్తో డబ్బు వసూళ్లకు అలవాటుపడిన సైబర్ నేరగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరించి నిలువుదోపిడీ చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే వీరేశానికి న్యూడ్ కాల్ చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News March 6, 2025
NLG: విచారణలో తేలితే.. సర్వీస్ బ్రేకే!

నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులకు మరోసారి ఛార్జ్ మెమోలు అందజేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖకు చెందిన జిల్లా అధికారి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లారు. గతంలోనే 109 మందికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ అధికారి తాజాగా 134 మందికి ఛార్జి మెమోలు అందజేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు విచారణలో తేలితే.. వారి సర్వీస్ బ్రేక్ చేయనున్నారు.
News March 6, 2025
BREAKING: నాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నాంపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బుధవారం రాత్రి వడ్డేపల్లి రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిపల్లి వద్ద బత్తాయి తోటలో పనులు ముగించుకుని తన భార్యతో కలిసి వస్తుండగా నాంపల్లి మండలం వడ్డేపల్లి మూలమలుపు వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. నాంపల్లికి చెందిన పూల సత్తయ్య, సత్తమ్మ కుమారుడు రవిగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.