News March 5, 2025
ఇవాళ్టి ఎగ్జామ్‌కు ఎంపిక చేసిన సెట్ ఇదే

ఏపీలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ సబ్జెక్టు పరీక్ష ఉంది. దీనికి సెట్ నెంబర్ 1 ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.
Similar News
News March 6, 2025
పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

AP: నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు సూర్యారావుపేట, భవానీపురం, మన్యం(D) పాలకొండ పోలీసులు ఆయనపై PT వారెంట్లు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయన్ను విచారణ చేసేందుకు ఆదోని పోలీసులు కర్నూలు కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా ఓబులాపురం పోలీసులూ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.
News March 6, 2025
బీజేపీలోకి సీఎం రేవంత్‌ను ఆహ్వానిస్తాం: అరవింద్

TG: CM రేవంత్ BJPలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని BJP MP ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనను పార్టీలోకి తీసుకుంటారా? లేదా? అనేది తన చేతుల్లో లేదన్నారు. రేవంత్‌ను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన అలా చేస్తే CM స్థాయిలో రేవంత్ చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అటు కేంద్రం నిధులిస్తున్నా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలను MP ఖండించారు.
News March 6, 2025
ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: మోదీ

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP, కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని దీవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో NDA కూటమి విజయంపైనా హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి ప్రయాణాన్ని NDA కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని భరోసా ఇచ్చారు.